లడ్డు పేరు చేబితే వేంటనే
టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల నుండి కోట్లకు
పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో ఆరగించి తినేది తిరుపతి
లడ్డు.లడ్డూలంటే మన తిరుపతి లడ్డూలే ఆరుచి మన నాలుకను చేరుకొగానే మనసంతా
ఒక్కసారి భక్తిభావంతో పులకరించి
మయమరుస్తుంది.శ్రీవారి ప్రసాదంలో
దద్దోజనం,పోంగలి వంటివెన్నున్నా తిరుపతి లడ్డూకున్న గిరాకితో పోలిస్తే
ఇవేవి సరిపోవు.
ఎవరెంత కొపంతో ఉన్నా వారికి తిరుపతి లడ్డూ ఇస్తే
ఇట్టే కరిగిపొతారు.ఏపని సాదించడానికి అయిన అంతటి బ్రహ్మస్త్రం మన
లడ్డూ.పూర్వకాలం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంచుతున్నా 1940
ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి
మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్దతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ
తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం
స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో
సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడేఅ సరుకులు -
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలుఈ మిశ్రమంలో సుమారు
5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న
వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను
కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని
యంత్రాలను ప్రవేశపెట్టారు.వీటివల్ల కొంచెం రుచి,నాణ్యత తగ్గినా గిరాకి
మాత్రం తగ్గలేదు.ఈ మద్యే మన లడ్డూకు పేటెంట్ హక్కు కూడా లభించింది.
ఆలయంలో లభించే లడ్డూలు మూడు రకాలు
1.ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక వుత్సవాలు
సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని
అందజేస్తారు.
2.కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో ఉత్సవాల్లో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
3.ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.
అష్టావధానం
|
|
|
అష్టావధానం 8 మంది
వృచ్చకులు 8 ప్రక్రియలుకు సంభందించిన ప్రశ్నలను అవధానిని అడుగుతారు.వాటికి
అవధాని సమాధానాలు ఇస్తాడు.దీనికి కనీస సమయం 4 గంటలు.
అష్టావధానంలో ప్రక్రియలు
1.కావ్య పాఠము
2.కవిత్వము
3.శాస్త్రార్ధము
4.ఆకాశ పురాణము
5.లోకాభి రామాయణము
6.వ్యస్తాక్షరి
7.చదరంగము
8.పుష్ప గుణము
కూచిపూడి నృత్యం
|
|
|
ప్రతి
తెలుగువాడు మన నృత్యం అని గర్వంగా చెప్పుకోవలసిన నృత్యం కూచిపూడి
నృత్యం.ఇది కళాపిపాసులను మంత్ర ముగ్దులను చేస్తుంది.ప్రపంచంలో ఎ మూలన
ఎవేదికపైన ఈ నృత్య ప్రదర్శన జరిగినా కళాకారులకు ప్రేక్షకులు చప్పట్లతో
నిరాజనం పలుకుతారు. అంతటి విశిష్టత కలిగిన నృత్యం మన కూచిపూడి.
ఈ నృత్యం మన కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనేగ్రామంలో ఉదయించింది.ఆ గ్రామం
పేరు మిదే దినికి కూచిపూడి నృత్యం అనే పేరు వచ్చింది.ప్రాచీనకాలం నుండి
ఇది ఉన్నా అంతగా ప్రాచుర్యం పొందలేదు.కేవలం దీనిని దేవాలయాల్లో మగవారు
మాత్రమే ప్రదర్శించేవారు.అయితే 15వ శతాబ్ది కాలంలో సిద్దేంద్ర యోగి కొన్ని
మార్పులు చేసి ఆడవారు ఈ నృత్యాన్ని చెయ్యవచ్చని చాటి చెప్పారు.ఇంకా
మరెందరో మహనుభావులు దీనీమిద మమకారంతో ఈ నృత్యం అభివృద్ధికి తమ వంతు సాయం
చేసారు. కూచిపూడి నృత్యంలో కళాకారులు పాదాలను లయబద్దంగా కదుపుతూ,కళ్లలో
హవభావాలను వ్యక్తం చేస్తూ,అనేక భంగిమలతో ఈ నాట్యాన్ని
ప్రదర్శిస్తారు.కూచిపూడి నృత్య ప్రదర్శన విఘ్నేశ్వరుని స్తుతి,సరస్వతి
స్తుతి,లక్ష్మి,పరాశక్తి స్తుతులతో మొదలవుతుంది.ఈ నృత్యంలో అనేక రకాల
ప్రదర్శనలు ఇస్తారు.ఉదాహరణకు సత్యభామను అనుకరిస్తూ భామనే సత్యభామనే అంటూ
చేసేదాన్ని భామాకలాపం అంటారు. ఇత్తడి పళ్ళెంపై రెండు పాదాలు అనించి చేసే
నృత్యాన్ని తరంగం
అంటారు.అర్ధనారీశ్వరమా,శాంకుంతలము,యిద్దమ-శాంతి,నట్టువాగం ఇలా ఎన్నో
ఉన్నాయి.
|
కొండపల్లి బొమ్మలు
|
|
|
కృష్ణాజిల్లాలోని కొండపల్లిలో
తయారయ్యే కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.ఈ బొమ్మలు
చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.వీటిని ఇక్కడి కళాకారులు జీవకళ ఉట్టిపడేలా
చక్కని ఆకృతి,ఆకట్టుకునే రంగులతో తీర్చిదిద్దుతారు.వీటిని కొండపల్లిలోని
కొండూరు అడవుల్లో లభ్యమయ్యే మెత్తని తెల్లపోని కర్రను తీసుకువచ్చి
కావలసిన సైజుల్లో ముక్కలు చేసి బావుదారు అనే ప్రత్యేక పనిముట్టుతో అనేక
ఆకృతుల్లో మలుస్తారు.ఆతరువాత చూడచక్కని వర్ణాలతో వీటిని ముస్తాబు
చేస్తారు. ఇలా తయారు చేసే ఈ బొమ్మలకు మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా
మంచి గిరాకి కలదు.ఇక్కడి బొమ్మలను అనేక రూపాల్లో మలుస్తారు.కొంతకాలం
ముందు వరకూ వీరు కేవలం ఏనుగు అంబారి,దశవతారాలు,తాడిచెట్టు
గుర్రం,మానవాకృతులు మొదలైన వాటిని రూపొందించేవారు.అయితే మారుతున్న కాలం
ప్రకారం ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ ఆకృతులను రూపొందిస్తున్నారు.
కొండపల్లి బొమ్మల తయారిపై ఆధారపడి 125 కుటుంబాల వరకూ జీవితం
సాగిస్తున్నాయి.ప్రస్తుత మార్కెట్లో వస్తున్న ప్లాస్టిక్ బొమ్మల వల్ల
వీటి అమ్మకాలు కొంతమేర తగ్గాయనే చేప్పాలి.ఈ కళాకారులను ఆదుకుని హస్త
క్కళలను రక్షించడానికి ప్రభుత్వం లేపాక్షి,హస్తకళలు ఎంపోరియంల ద్వారా
మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది.ఈ బొమ్మల తయారికి అవసరమయ్యే కలప కోసం
కొండపల్లి అడువుల్లో 5050 ఎకరల్లో తెల్లపోని చెట్లను పెంచుతుంది.
అంతరించి పోతున్న మన సంస్కృతికి చిహ్నలైన హస్తకళలను పరిరక్షించవలసిన
భాద్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
|
పుల్లారెడ్డి స్వీట్స్
|
|
|
మన ఆంధ్రప్రదేశ్ లో
లోపుల్లారెడ్డి నేతి మిఠాయిలు అంటే తెలియని వారెవరూ ఉండరంటే
అతిశయోక్తిలేదేమో.. అంతగా వీరు తయారు చేసే మిఠాయిలు ప్రాచుర్యం
పొందాయి.కర్నూలు జిల్లా గోకవరం గ్రామానికి చెందిన జి. పుల్లారెడ్డి 1948లో
కర్నూలులో మిఠాయిల దుకాణాన్ని ప్రాంభించారు.ఆ ప్రాంతంలో పుల్లారెడ్డి
మిఠాయిలకు మంచి గుర్తింపు రావడంతో తన వ్యాపారాన్ని హైదరాబాదు సహా మరిన్ని
ప్రాంతాలకు విస్తరించారు.పుల్లారెడ్డి మిఠాయి దుకాణాలలో కోవా, బూందీ లడ్డు
లకు మంచి ప్రాముఖ్యం కలదు.
|
ఒంగోలు గిత్త
|
|
|
దర్పానికి,రాజసానికి
మారుపేరు మన ఒంగోలు జాతి గిత్తలు.రైతులు ఇవి తమ దగ్గరుంటే ఎంతో విలువైన
ఆస్తి తమ దగ్గరున్నట్టు బావిస్తారు.నిలువెత్తు అందం, బలమైన దేహ దారుడ్యం,
కష్టించి పనిచేసే మనస్తత్వం వీటి సొంతం. ఈ గిత్తలు పరమశివుని వాహనం అయిన
నందిని పోలిఉంటాయి. ఇవి ఎటువంటి వాతావరణ పరిస్ధితుల్లోనైనా తట్టుకుని
నిలబడగలవు.
ఒంగోలు గిత్తలు కేవలం స్వదేశియులనే కాకుండా
విదేశియులను సైతం తమ పనితనంతో కట్టి పడేసాయి.ఒక్క బ్రెజిల్ దేశంలోనే మన
ఒంగోలు జాతి గిత్తలు 20 లక్షలు వరకూ ఉన్నాయంటే వీటి మీద ఎంత మక్కువో అర్ధం
చేసుకోవచ్చు.అమెరికాలో ఒంగోలు గిత్తల సాయంతో బ్రహ్మస్ అనే సంకరజాతిని
సృష్టిచేసారు అక్కడి శాస్త్రవేత్తలు.ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా..
ఆస్ట్రెలియా, మెక్సికో,మలేషియా,అర్జెంటినా, ఇండోనేషియా వంటిదేశాల్లో మన
ఒంగోలు గిత్త గర్వంగా నిలబడి తెలుగుజాతి శక్తిని ప్రపంచానికి
చాటిచెబుతుంది.హాలాండ్ దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పొతురాముడు అనే
పేరుతో మనగిత్త విగ్రహం ఏర్పాటు చేసారట అది మన ఒంగోలు గిత్త గొప్పదనం.
అయితే ఆధునిక వ్యవసాయ సాధనాలు వచ్చాక వీటి అవసరం
నానాటికీ తగ్గిపోతుంది.వ్యవసాయం కోసం కాకుండా కేవలం మాంసం కోసమే వీటిని
పెంచుతున్నారు. అలాంటి దౌర్భాగ్య స్ధితి నుండి మన జాతికి గర్వకారణమైన వీటి
మనుగడను కాపాడవలసిన భాద్యత అందరిపైనా ఉంది.అందుకే ప్రభుత్వం వారు నడుం
బిగించి మన రాష్ట్ర ప్రభుత్వం,ఒంగోలు జాతి పశు ఉత్పత్తిదారుల సంఘం కలసి
ఒంగోలు జాతి పశువుల అభివృద్ది పధకాన్ని చేపట్టారు.దీనిలో భాగంగా
గుంటూరులోని లాంఫారం కేంద్రంగా వీటి అభివృద్దికి పరిశోధనలు
చేస్తున్నారు.తెలుగోడి పౌరుషానికి చిహ్నమైన వీటిని రక్షించే భాద్యత
తీసుకుంటే మన భావితరాల వారికి ఫోటోలోనో, సినిమాల్లోనో చూపించకుండా వారికి
పరిచయం చేయగలుగుతాం.
|
|
|
No comments:
Post a Comment